నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత..కేసు నమోదు

by Kalyani |
నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత..కేసు నమోదు
X

దిశ, మక్తల్: మక్తల్ పట్టణంలో సోమవారం ఎల్ బి నగర్ కాలనీ లో కొనసాగుతున్న కిరాణా దుకాణంపై స్పెషల్ పోలీసులు దాడి చేసి నిషేధిత గుట్కాలను పట్టుకున్నారు. కృష్ణ పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్ గజ్జి రాకేష్ కిరాణా దుకాణం లో నిల్వ ఉంచిన రూ. 9,330 విలువగల నిషేధిత గుట్కా, జట్కా పట్టుకున్నట్టుగా సమాచారం. ప్రభుత్వ నిషేధిత అంబార్ జర్థా, గుట్కా ప్యాకెట్లు గురు స్వామి నిల్వ ఉంచారన్న సమాచారంతో స్పెషల్ టాస్క్ పోలీసులు,స్థానిక సిబ్బంది సంయుక్తంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 5, 390 రూపాయలు విలువ ఉందని ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. గురుస్వామిని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యక్తి పై పలుమార్లు నిషేధిత గుట్కా కేసులు నమోదయినందున ఈయనపై పిండి యాక్ట్ నమోదు చేస్తే మక్తల్ లో గుట్కా వ్యాపారంకు తేరు పడుతుందని ప్రజలు అంటున్నారు.

Next Story

Most Viewed