- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం దాటి పోకుండా.. కేసీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయండి.!
దిశ ప్రతినిధి నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో కిందిస్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు అన్ని సంక్షేమ పథకాలు, ప్రాజెక్టు నిర్మాణాల్లో రీ డిజైన్ పేరుతో భారీ అవినీతికి పాల్పడి వేల కోట్లు దోచుకున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఓటమి అనంతరం దోచుకున్న డబ్బుతోనే దేశం దాటి పారిపోయే ఏర్పాట్లు ముందస్తుగా చేసుకుంటున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
మంగళవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం 40 శాతం అవినీతికి పాల్పడితే, ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపారని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సుమారు 70% అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.
క్రింది స్థాయి గల్లీ లీడర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి పనిలో 70% వాటాపొంది లక్షల కోట్లు పోగు చేసుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే అదే డబ్బుతో ఎన్నికల్లో ఖర్చు చేయాలని సూచన మేరకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి కాగ్ నివేదిక ద్వారానైనా ప్రజలు గుర్తుకు రావలని ఈ అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు మేధావులు సిద్ధం కావాలన్నారు.
దళిత బంధు పథకంలో పది లక్షల ఇస్తే అందులో 3 లక్షలు ఎమ్మెల్యేలు నొక్కారని ఏకంగా ముఖ్యమంత్రి ఒప్పుకొని చివరికి వాళ్లకే టికెట్లు ఇచ్చారని దీని ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబితే ఓటమిపాలై లక్షల కోట్ల ప్రజాధనంతో దేశం విడిచి పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాడని ముందస్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తన ఓటమి కోసం ఇచ్చిన హామీ, మార్కండేయ ప్రాజెక్టు నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే నాగం జనార్దన్ రెడ్డికి ప్రచారం చేస్తానని ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటిదాకా నిర్మాణం పూర్తి కాలేదు. మరి ఇచ్చిన మాట ప్రకారం తన గెలుపు కోసం ప్రచారం చేయాలని నాగం డిమాండ్ చేశారు. పంచభక్ష పరమాన్నం పెట్టి ప్రచార రథం కూడా ఇస్తా వచ్చి నాకు ప్రచారం చేయి అంటూ ఎద్దేవా చేశారు.