- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత దృక్పథంతో కాపాడండి: అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్
దిశ, కొత్తకోట: ప్రమాదంలో గాయపడిన వారిని మానవత దృక్పథంతో కాపాడాలని వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్ అన్నారు. శనివారం కొత్తకోట మండల కేంద్రంలో పోలీస్ శాఖ EMRI ఆధ్వర్యంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం చేయాల్సిన సపోర్ట్, ప్రథమ చికిత్సపై వాహనాల డ్రైవర్లకు, పట్టణ ప్రజలకు అవగాహన సదస్సు శివగార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ఏఎస్పీ షాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదానికి గురై ఆ కుటుంబంలో ఒకరు మరణిస్తే ఆ కుటుంబంలో తీరని వేదన మిగలడంతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయని అన్నారు.
వీటిని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రమాదకరమైన రహదారులను, డేంజర్ స్పాట్లను, గుర్తించడంతో పాటు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే రహదారుల్లో నివారణ కోసం రక్షణ చర్యలు ఏర్పాటు చేపట్టామని ఆయన అన్నారు. ప్రమాదాలకు గురై గాయపడ్డ వారికి మానసిక ధైర్యం కల్పించడం కోసం మనం సపోర్ట్ గా ఉంటూ ప్రథమ చికిత్స అందించి అంబులెన్స్ కు సమాచారం అందించాలని అన్నారు.
రోడ్డు సేప్టీ వింగ్ డీఎస్పీ చంద్రబాను మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగిన సమయంలో సదరు వ్యక్తికి మనం ఇచ్చే ధైర్యం ముఖ్యమని అలా కాకుండా చాలామంది యాక్సిడెంట్ జరిగిన వారికి ప్రథమ చికిత్స అందించకుండా సెల్ ఫోన్ లో పోటోలు తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. EMRI హెల్త్ సర్వీస్ డాక్టర్ సతీష్ యాక్సిండెట్ జరిగిన సమయంలో ఎలాంటి చికిత్స అందించి క్షతగాత్రులను కాపాడాలో డ్రైవర్లకు, ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.