- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి: సుధాకర్ రెడ్డి
దిశ, వంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట డిమాండ్ చేశారు. గురువారం వంగూర్ మండల కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి అలాగే రైతు రుణమాఫీ కూడా అందరికీ సకాలంలో అయ్యేవిధంగా చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పుతుందని.. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
అలాగే రైతులందరికీ షరతులు లేని రుణమాఫీ చేయాలని తెలిపారు. అదేవిధంగా కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ప్రతి బూతు లోకి వెళ్లి అందరినీ బీజేపీ సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించి సభ్యత్వ నమోదులో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రాగి రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు అలే భీమయ్య, మండల నాయకులు సిలువేరు సైదులు, నవీన్ రెడ్డి, యాదయ్య, కొమ్ము మల్లేష్, సైదులు, కృష్ణ, రాఘవేందర్, భాస్కర్ రెడ్డి, కొండల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.