- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి పై అభిమానం.. శ్రీశైలానికి కాలినడకన తరలిన యువకుడు
దిశ, కొత్తకోట : రేవంత్ రెడ్డి పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు ఓ యువకుడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన రాజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి సీఎం కావాలని శ్రీశైలం మల్లికార్జున స్వామికి మొక్కులు మొక్కాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దీనికి తోడు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేశారు.
దీంతో తన మొక్కును తీర్చుకునేందుకు రాజు శుక్రవారం కానాయపల్లి గ్రామం నుండి కాలినడకన శ్రీశైలంకి బయలుదేరాడు మూడు రోజు కాలినడకన శ్రీశైలానికి చేరుకొని అక్కడ మల్లికార్జున స్వామికి తన మొక్కులు చెల్లించుకుంటానని రాజు చెప్పాడు. రాజును పాదయాత్రలో కలిసి కానాయపల్లి కాంగ్రెస్ నేతలు లక్ష్మి నారాయణ శివ, అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో కూడా రాజు కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామంలో ప్రచారం నిర్వహించి తన వంతు పాత్ర పోషించాడు.