- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గేటు బయట నుంచే విద్యార్థులను కలవాలి.. పాఠశాలలో ఆంక్షలు
దిశ, కల్వకుర్తి: సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు ప్రైవేటు పాఠశాలలోనే చదివించాలని అనుకుంటుంటారు ధనిక తల్లిదండ్రులు. కానీ చాలీచాలని బతుకలతో రోజులు నెట్టుకొస్తున్నా.. నిరుపేదలు మాత్రం వేరే మార్గం లేక ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపిస్తుంటారు. స్టూడెంట్ టైంకి రాకపోతే బయట నిల్చోబెట్టడం చూశాం. కానీ బిడ్డల్ని చూడటానికి వచ్చిన తల్లిదండ్రులను గంటల తరబడి గేటు బయటే కారు టెండలో నిరీక్షణ చేసే దౌర్భాగ్యం మన కల్వకుర్తి పట్టణంలోని మహాత్మా జ్యోతి రావు బా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్ లో గల ఎం.జె.పి.టి.బి.సి.డబ్లు.ఆర్ (గర్ల్స్) పాఠశాలలో కల్వకుర్తి, ఉర్కొండ, వెల్టూర్ స్కూళ్ళకు సంబంధించి దాదాపు 715 మంది విద్యార్థినులు చదువుకుంటారు. వారి కోసం విద్యార్థినీల తల్లిదండ్రులు ఒక మాసం నుంచి మూడు మాసాలకొకసారి బిడ్డల్ని చూడటానికి కొల్లాపూర్, గద్వాల్, అమరచింత, అచ్చంపేట ఇలా సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తారు. పలుమార్లు ఈ స్కూల్ సిబ్బంది వచ్చిన తల్లిదండ్రులను ఎండలో గేటు బయటే రెండు గంటల నుంచి మూడు గంటలు నిరీక్షణ చేపించి వారి వారి బిడ్డల్ని గేటు లోపల నుంచే మాట్లాడుకోవడానికి 10 నుంచి 15 నిమిషాల కాల వ్యవధిని కేటయిస్తున్నారు. సర్కారు నిబంధనల ప్రకారం విద్యార్థినుల తల్లిండ్రులు తమ పిల్లల్ని చూసుకోవడానికి ప్రతి నెల రెండవ ఆదివారం విద్యాలయం లోనికి అనుమతివ్వబడుతుంది. కానీ ఈ నిబంధనలకు నీల్లోదిలి ఎండలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లుదండ్రులను లోపలికి అనుమతివ్వకుండా గేట్ బయటే నిల్చోబెట్టి వేరే విద్యర్థినీలతో చీటిలు రాసి పంపిస్తూ లోపలి నుంచి విద్యార్థులు తీసుకొచ్చి ములాఖత్ చేపిస్తున్నారు.
అదేంటని తల్లితండ్రులు గేట్ వాచ్ మెన్ ను అడగగా.. ప్రిన్సిపాల్ మేడం చెప్పారు ఎవరికి అనుమతివ్వోద్దని సమాధానమిస్తున్నాడు. ఇదే నేపథ్యంలో పాఠశాలకు ఎలాంటి సంబంధం లేని ఓ సర్కారు ఉద్యోగి కార్యాలయ లోపలికి ఎలా అనుమతిస్తున్నారు. ఇలా నిబంధనలకు పాతరవేస్తూ పాఠశాల సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై దిశ ప్రతినిధి పాఠశాలకు వెళ్లి వివరణ అడుగుదామని లోపలికి వెళ్ళగా ప్రిన్సిపాల్ చాంబర్ లో ఖాళీ కుర్చీ దర్శనమివ్వడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇంచార్జి ఉన్నారన్నారు. ఇంచార్జిని వివరాలు అడగగా.. తనకు ఏం తెలియదని సమాధానమిచ్చి ఫోన్ లో ఇంచార్జి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తాను వచ్చి 2 మాసాలవుతుందని, పాఠశాల పై ఇంకా పూర్తి అవహగాన లేదన్నారు. విద్యార్థినీల తల్లిదండ్రులను గేటు బయటే నిల్చోబెట్టడానికి గల కారణాలు, గెస్ట్ ఫ్యాకల్టీ తో అధిక తరగతులు నిర్వహించడం, ప్యూరి ఫైడ్ ఫిల్టర్ వాటర్ ను విద్యార్థులకు అందించకపోవడం, సాంస్కృతిక, డాన్స్ ఫ్యాకల్టి, యోగ టీచర్ వివరాలు వారి విధులు, పీఈటీలు, విద్యార్థినీల ఆరోగ్య సమస్యలు మొదలగు వివరాల గురుంచి అడగగా కరోనా నిబంధనల కారణంగా పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రుల అనుమతిలేదన్నారు. మిగతా వివరాలకు పొంతనలేని సమాధానమిచ్చారు. గెస్ట్ ఫాకల్టీ కి ప్రతి రోజు 4 తరగతులు కాగా.. అదనంగా అధిక క్లాసులు నిర్వహిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించగా.. అప్పుడప్పుడు తరగతులు నిర్వహిస్తారన్నారు. మూడు నెలలు ముందే వాటర్ ప్లాంట్ చెడిపోయి శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సాధారణ నీళ్ళు తాగడం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి రకరకాల వ్యాధులు ప్రబలయ్యే అవకాశాలున్నాయని తెలిసి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహించి విద్యార్ధినీల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
బాలికల పాఠశాలలో మహిళ డాన్స్ టీచర్ ఉండాలన్న నిబంధనలున్నప్పటికి.. వాటికీ విరుద్దంగా పురుషుడికి ప్రాధాన్యత ఇవ్వడం శోచనీయం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సమస్యలకు కేంద్ర బిందువుగా ఉన్న మహాత్మా జ్యోతి రావు బా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాల పై దృష్టి సారించి విద్యార్థినీల భవిష్యత్ కు పునాది వేసి, గురుకులాలలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై తక్షణమే స్పందించాలని విద్యార్థినీల తల్లితండ్రులు కోరుకుంటున్నారు.