- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు, రాజశ్రీ కోళ్ల పంపిణీ
దిశ, అచ్చంపేట: జిల్లాలోని నల్లమల లోతట్టు ప్రాంతం లింగాల మండలం అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఈర్ల పెంట, సుడిగుండాల పెంట, మెడిమల్కల, పుళ్ళయపల్లి పెంటలలోనీ చెంచు కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఈర్లపెంటలోని చెంచు కుటుంబాలకు సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులు పంపిణీ చేశారు. బౌరపూర్, అప్పాపూర్ పెంటలలో మగువ లడ్లూలు పంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు దుప్పట్లు, రాజర్షి కోళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆదివాసీలకు రాజర్షి కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు.
రాజశ్రీ కోళ్ల గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఒక రాజశ్రీ రకం కోడి ఏడాదికి 250 గుడ్ల దాకా పెడుతుందని పేర్కొన్నారు. అలాగే వాటి మాంసానికి కూడా మంచి గిరాకీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్య్రమంలో వైస్ చైర్మన్ శ్రీధర్, జిల్లా యూత్ కన్వీనర్ డి.కుమార్, రెడ్ క్రాస్ సభ్యులు కృష్ణ రావు, రాజేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.