MP : పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యలు పరిష్కరించాలి

by Kalyani |   ( Updated:2024-10-24 12:46:20.0  )
MP : పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యలు పరిష్కరించాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే శాఖకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని రైల్వే అజెండా లో చేర్చుకోకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వెంటనే పరిష్కరించాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీలక సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా మహబూబ్ నగర్ పట్టణంలోని వీరన్న పేట్,తిమ్మసానిపల్లి లో రైల్వే ఓవర్ బ్రిడ్జి ను,మోతినగర్ వద్ధ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, దేవరకద్ర పట్టణంలో ఆర్వోబీ ఉన్నందున ప్రజల, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలని ఆమె కోరారు.

అలాగే జడ్చర్ల పరిధిలోని రంగారెడ్డి గూడ వద్ద, వనపర్తి రోడ్ స్టేషన్ 19 ఏ వద్ధ, కౌకుంట్ల ఎస్ఈ 80,81 క్రాసింగ్ వద్ద ఆర్వోబీ లను వెంటనే నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో గూడ్స్ షేడ్ మూసివేశారని, వెంటనే రీ ఓపెన్ చేయాలని, కృష్ణ-వికారాబాద్ రైల్వే లైన్ పురోగతిని ప్రశ్నిస్తూ వెంటనే పూర్తి చేయాలని ఆమె కోరారు. అలాగే మహబూబ్ నగర్-తాండూర్,జడ్చర్ల నుంచి నంద్యాల, మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. జడ్చర్ల వద్ధ రైల్వే పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు 47173,47210 నెంబర్ ఎంఎంటీఎస్ రైళ్ళను షాద్ నగర్ వరకు పొడిగించాలని, గద్వాల రైల్వే స్టేషన్ వంద ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేయకపోవడం అభ్యంతరం వ్యక్తం చేస్తూ,అక్కడ వందేభారత్ ట్రైన్ హాల్ట్ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, ఈటేల రాజేందర్, సురేష్ రెడ్డి, నగేష్, తదితర రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story