స్కాన్ చేయండి.. కేసీఆర్, బీఆర్ఎస్ గొప్పతనాలు చూడండి..

by Sumithra |
స్కాన్ చేయండి.. కేసీఆర్, బీఆర్ఎస్ గొప్పతనాలు చూడండి..
X

దిశ, ఉండవల్లి : ట్రెండ్ మారేకొద్ది టెక్నాలజీలో కొత్త కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. మారుతున్న కాలానికి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. మనం ఏదైనా కొంటె వాటి ఆర్థిక లావాదేవీలను డిజిటల్ రూపంలో చెల్లింపు ప్రక్రియలో భాగంగా ప్రతి దుకాణాల వద్ద ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, వంటి వాటిని వినియోగిస్తున్న సంగతి ప్రజలకు తెలిసిందే.

కానీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు తెలుసుకునెందుకు స్కాన్ చేయండి కేసీఆర్ బీఆర్ఎస్ గొప్పతనాలు చూడండి అని చిన్నపాటి కేసీఆర్ చిత్రపటంతో కూడిన క్యూ ఆర్ కోడ్ స్కానర్లు పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ వెలిశాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వారందరూ తమ మొబైల్ లో ప్లే స్టోర్ లో క్యూ ఆర్ కోడ్ స్కానర్ యాప్ లో డౌన్లోడ్ చేసుకుని... వాటి పై క్లిక్ చేస్తే చాలు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఏమిటో తెలుసుకునే విదంగా ఉన్నాయి.. బీఎస్పీ పార్టీకి చెందిన వారు గ్రామాల్లో ఎక్కడ చూసిన ఈ పోస్టర్లను అతికించారు.

Advertisement

Next Story