protests : ఇథనాల్ కంపెనీ నిలుపుదలకు గ్రామ గ్రామాన పెల్లుబుకుతున్న నిరసనలు

by Kalyani |
protests : ఇథనాల్ కంపెనీ నిలుపుదలకు గ్రామ గ్రామాన పెల్లుబుకుతున్న నిరసనలు
X

దిశ, అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయవద్దని ప్రక్కనే ఉన్న చిన్న తాండ్రపాడు గ్రామ రైతులందరూ కలిసి ఏక నిర్ణయంతో ఊరి రచ్చబండ దగ్గర చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ “పల్లెటూరిలే దేశానికి పట్టుకొమ్మలని ఆనాడు పెద్దలు ఊరికే అనలేదు. ఇటువంటి పల్లెలను నాశనం చేయడానికి తుంగభద్ర నది సమీపాన వేల కోట్లు విలువచేసే ఇథనాలు కంపెనీ ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. నది కాలుష్యం కావడమే కాక నది పరివాహక ప్రాంతాల్లో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం అవుతుందని” అన్నారు.

ఈ కంపెనీ నుండి వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో చాలా ప్రాంతాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకొని జన ప్రాణ నష్టానికి గురయ్యా అవకాశం ఉందని అందువల్ల ఎట్టి పరిస్థితిలోనూ ఈ కంపెనీ ఇక్కడ నిర్మించకూడదని సుధాకర్ గౌడ్ అన్నారు. ఈ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలైన అష్టాదశ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయం శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆలయాలను దర్శించుకునే కోట్లాది మంది భక్తులు నీటి కాలుష్యంలో చిక్కుకొనే ప్రమాదముందని అన్నారు. అంతేగాక ఈ కంపెనీ చుట్టూ దాదాపు 20 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు కలుషితమై భూసారం తగ్గి పంటలు నాశనమై భవిష్యత్తులో పంటలు పండే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ తుంగభద్రా నది నీరు దాదాపు సగం రాయలసీమకే నీటి సరఫరా చేస్తున్నది కావున తెలంగాణ ఎంపీ మల్లురవి, కర్నూలు ఎంపీ లక్ష్మీనారాయణ, నంద్యాల ఎంపీ శబరి వీరు ఇట్టి విషయాన్ని పార్లమెంటులో తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కావున కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజాభిప్రాయ సేకరణను దృష్టిలో ఉంచుకొని తక్షణమే కంపెనీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రజలప్రాణాలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహేష్ నాయుడు( మాజీ ఉపసర్పంచ్,) సత్యం నాయుడు, వందనము, మీసాల సత్యన్న(మృత్యకారుల సంఘ అధ్యక్షులు)భగత్ సింగ్ యువజన సంఘం గ్రామ యువత మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story