- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నిరంతర విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం'
దిశ, నారాయణపేట ప్రతినిధి: రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ.. రైతులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి, మాజీ డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి లు అన్నారు. రైతుల కరెంట్ సమస్యలపై జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ధర్నా నిర్వహిచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 8 గంటల నాణ్యమైన విద్యుత్ ను చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్ల విజయ్ కుమార్, నర్సింహులు, మద్దూర్ జడ్పిటిసి రఘుపతి రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి కౌన్సిలర్ ఎండి. సలీం, రఘు బాబు తదితరులు పాల్గొన్నారు.