- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
శారీరక శ్రమ ద్వారా డయాబెటిస్ దూరం : వనపర్తి జిల్లా కలెక్టర్
దిశ,వనపర్తి : ప్రతి రోజు అరగంట సమయం వ్యాయామం,యోగా,ధ్యానం చేసేందుకు కేటాయించడం ద్వారా డయాబెటిస్ వ్యాధిని అదుపు చేసుకోవచ్చునని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య,ఆరోగ్య శాఖ,అసంక్రమిత వ్యాధులు నివారణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ భారత దేశంలో ప్రస్తుతం 73 మిలియన్ల ప్రజలు డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారని,వనపర్తి జిల్లాలో 39,721 మంది బాధపడుతున్నారని తెలిపారు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నదన్నారు.వనపర్తి జిల్లాలో మిషన్ మధుమేహ కార్యక్రమం ద్వారా 30 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికి డయాబెటిస్ పరీక్షలు చేయించి,డయాబెటిస్ నిర్ధారణ అయిన వారికి మందులు అందిస్తున్నామన్నారు.చక్కెర శాతం తక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సాయినాథ్ రెడ్డి, రామచంద్ర రావు,డాక్టర్ పరిమళ, రాష్ట్ర డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ వస్సీ,జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ రంగారావు,మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సునందిని,జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్లు చంద్రయ్య,మహేశ్వర చారి,శ్రీనివాస్ కొండ, ఎన్ సి డి డేటా మేనేజర్ అశోక్ కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.