Power transformer : నీటి మడుగులో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్.. పొంచి ఉన్న ప్రమాదం..

by Sumithra |
Power transformer : నీటి మడుగులో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్.. పొంచి ఉన్న ప్రమాదం..
X

దిశ, దేవరకద్ర : నీటి మడుగులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉంది. దేవరకద్ర మండలం కేంద్రంలో రాయిచూర్ ప్రధాన రహదారిలో కన్యకా పరమేశ్వరి దేవాలయం పక్కన ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదభరితంగా మారింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ నీటితో నిండి పోయింది. ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ ఏర్పాటు చేయాల్సి ఉన్నా సంబంధిత అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.

దీంతో ట్రాన్స్‌ ఫార్మర్లకు పక్కన వెళ్ళే ప్రజలు, ప్రక్కనే ఉన్న షాప్ ల వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు. పక్కనే ఉన్న రోడ్డు గుండా నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. పైగా ట్రాన్స్‌ఫారమ్ తక్కువ ఎత్తులో ఉండటంతో రోడ్డుగుండా వెళ్ళాలనుకునే వారికి ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ కు రక్షణ కవచాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ కు కంచె, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story