- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇతనాల్ కంపెనీ వద్ద టెన్షన్.. పోలీసుల లాఠీచార్జ్
దిశ బ్యూరో, మహబూబ్ నగర్/మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామం వద్ద ఉన్న జూరాల ఆగ్రో ఇతనాల్ కంపెనీ వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ కాలుష్యాన్ని కలిగించే ఈ కంపెనీ మాకు వద్దు అంటూ గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులు.. శనివారం రాత్రి కంపెనీ నుండి వ్యర్థ పదార్థాలను ట్యాంకర్ లో తరలిస్తుండగా కంపెనీ సమీపంలో ఉన్న ఎక్లాస్పూర్, చిత్తలూరు, జిన్నారం, కన్మనూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రి నుండి ఉదయం వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశారు. మాట మాట పెరగడం.. గ్రామస్తులు గొడవలకు దిగడంతో పోలీసులు తప్పని పరిస్థితులలో లాఠీచార్జ్ చేశారు. ఈ సంఘటనలో ఇద్దరికీ కాళ్లు విరుగగా, మరొకరికి తల పగిలింది. దీనితో మరింత రెచ్చిపోయిన జనం.. పోలీసులపై దాడులకు పాల్పడ్డారు.
మక్తల్ సీఐ రాంలాల్, మరి కొంతమంది పోలీసులకు గాయాలు అయ్యాయి. బాష్ప వాయువు వాహనంతో పాటు, పోలీసులకు సంబంధించిన మరో రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు అంటించారు. కొంతమంది పోలీసులను కంపెనీ గదిలో వేసి తాళం వేశారు. దీనితో మరిన్ని పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.