- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పరదేశి నాయుడి త్యాగం అజరామరం : ఎస్పీ జానకి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సమాజ శాంతికి స్వర్గీయ ఎస్పీ పరదేశి నాయుడు చేసిన ప్రాణ త్యాగం అజరామరం అని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.గురువారం స్వర్గీయ ఎస్పీ పరదేశి నాయుడి 30 వర్ధంతి సందర్భంగా స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి,ఆయన వెంబడి అసువులు బాసిన పోలీస్ అధికారులకు,సిబ్బంది కి ఘనంగా నివాళులర్పించి,రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె మాట్లాడారు.
పరదేశి నాయుడు విధి నిర్వహణలో తన ప్రాణాలర్పించి,ఆయన చూపిన ధైర్యం ప్రతి పోలీసుకు స్ఫూర్తిదాయకమని,పోలీస్ శాఖ,సమాజం గర్వించదగ్గ వ్యక్తి పరదేశినాయుడని ఆమె ప్రశంసించారు.ప్రతి ఒక్కరూ ఆయన త్యాగాలను గౌరవించి సమాజంలో శాంతి స్థాపనలో తమ వంతు పాత్ర పోషించాలని ఆమె సూచించారు.అనంతరం పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రాములు,సురేష్ కుమార్,డిఎస్పీలు సుదర్శన్,రమణారెడ్డి,ఏఓ రుక్మిణీ,తదితర పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.