Panchayat Secretary : నేనే రాజు నేనే మంత్రి అన్న చందనంగా ఓ పంచాయతీ కార్యదర్శి..

by Sumithra |
Panchayat Secretary : నేనే రాజు నేనే మంత్రి అన్న చందనంగా ఓ పంచాయతీ కార్యదర్శి..
X

దిశ, బిజినేపల్లి : గత పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వం పల్లెల్లో పచ్చదనం పెంచడం కోసం పల్లె ప్రకృతి వనాలను పెంచితే ఓ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఎలాంటి తీర్మానాలు లేకుండా చెట్లను తొలగించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లను గ్రామ పెద్దల సమక్షంలో ఎలాంటి తీర్మానాలు చేయకుండా అమ్మడంతో అడ్డుకున్నారు గ్రామస్తులు. పల్లె ప్రకృతి వనం అంటే గ్రామ ప్రజల తీర్మానం ఉండాలి కానీ అవి ఏమీ పట్టనట్లుగా నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా గుడ్ల నర్వ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి చెట్లను అమ్మేటప్పుడు ఫారెస్ట్ సిబ్బందితో ఎలాంటి పర్మిషన్ లేకుండా అమ్మారని, దానితో పాటు గ్రామంలోని గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం రాసుకొని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెట్లను తొలగించడంతో అది చూసిన గ్రామస్తులు ( Villagers ) చెట్లను తొలగించొద్దని అడ్డుకున్నారు.

దిశకు సమాచారం ఇవ్వడంతో వివరణ కోసం పంచాయతీ కార్యదర్శి అడగగా ఆ కొనోకార్పస్ చెట్లు ఉండడంవల్ల శ్వాస కోష వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అందుకే వాటిని తొలగించి పండ్లు పూల మొక్కలను పెంచాలని, ఆ ఉద్దేశంతో ఆ మొక్కలను అమ్మేశానని వివరణ ఇచ్చారు. గుడ్ల నర్వ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లను తొలగించేందుకు తీర్మానం రాసుకున్నాం కానీ సోమవారం గ్రామ పెద్దల ముందర తీర్మానం చేద్దామని అనుకున్నామని సమాచారం అందించారు.

Advertisement

Next Story

Most Viewed