పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్

by Kalyani |
పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
X

దిశ, అలంపూర్ టౌన్: గ్రామ పంచాయతీల్లో విధులు సరిగా నిర్వర్తించడం లేదని, బీఎల్ఓ శిక్షణ తరగతులకు గైర్హాజరావడం, ఇతర అంశాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో మంగళవారం పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్‌రెడ్డిని జిల్లా కలెక్టర్ బిఎం. సంతోష్ సస్పెండ్ చేశారు. అయిజ మండలం పులికల్ పంచాయతీ కార్యదర్శిగా కిరణ్ కుమార్ రెడ్డి పని చేస్తున్నారు. జిల్లాలో అకాల‌ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలను బేఖతార్ చేస్తూ‌ విధులకు గైర్హాజరయ్యారని, అకాల వర్షాలకు పాతబడిన ఇండ్లలో నివసిస్తున్న వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించి పునారావాసం కల్పించాలని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

గత నెలలో ప్రభుత్వం తలపెట్టిన‌ స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీడిఓ, అయిజ తహసీల్దార్ పూర్తి విచారణ చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ వెంటనే సస్పెండ్ చేశారు. రాజాపూర్ పంచాయతీ కార్యదర్శి నాగరాజు ను పులికల్ అదనపు కార్యదర్శిగా(ఎఫ్‌ఏ సి) నియమించారు.

Advertisement

Next Story

Most Viewed