పూడ్చిన శవానికి పంచనామా..!

by Nagam Mallesh |
పూడ్చిన శవానికి పంచనామా..!
X

దిశ,మద్దూరు: జూలై నెల 11వ తారీఖు నాడు నందిపాడు గ్రామంలో చనిపోయిన దిడ్డి కవితమ్మ అలియాస్ రాములమ్మ శవాన్ని ఇరు కుటుంబ సభ్యులు మరుసటి రోజు అంత్యక్రియలునిర్వహించారు. ఆ తర్వాత మృతురాలి అన్న చిలుముల్ మైరారం గ్రామానికి చెందిన నరసింహులు తన చెల్లెలి మరణంపై అనుమానం ఉన్నదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో మృతదేహాన్ని స్థానిక మద్దూరు తహసీల్ దార్ మహేష్ గౌడ్ సమక్షంలో వెలికి తీశారు. శవపంచనామా నిర్వహించి ఆపై ప్రత్యేకంగా మహబూబ్ నగర్ నుండి ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా శవపరీక్ష చేసి మృతదేహాన్ని పంచుల సమక్షంలో కుటుంబ సభ్యుల సమక్షంలో తిరిగి పూడ్చివేశారు. ఇట్టి మరణంపై ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా మృతురాలి మరణానికి గల పూర్తి కారణాలు తెలుసుకోవచ్చని మద్దూర్ ఎస్సై రామ్ లాల్ తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story