- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు ప్రజాభేరి సభను రెండు లక్షల మందితో నిర్వహిస్తాం
దిశ, కొల్లాపూర్ : ఈ నెల 31న జరగబోయే కొల్లాపూర్ పాలమూరు ప్రజాభేరి సభను రెండు లక్షల మందితో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి అన్నారు. ముందుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర సభా స్థలాన్ని పరిశీలించి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని అన్నారు. కర్ణాటకలో అధికారం చేపట్టి ఇచ్చిన గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుందో, అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని అన్నారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు సాధించి అధికారం చేపట్టబోతున్నామని అన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ పది సంవత్సరాలు గడుస్తున్న పేదలకు రేషన్ కార్డులు ఇయ్యలేకపోయినోడు, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 ఎకరాలకు కూడా సాగునీరు అందించలేదన్నారు.
అనంతరం కూచుకుంట దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ముఖ్యమంత్రి తనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఈ ప్రాంత ప్రజాసమస్యలు తీర్చలేదన్నారు. నేటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని మండిపడ్డారు. పాలమూరు ప్రజాభేరి సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక కొల్లాపూర్ ఇంచార్జి పీవీ మోహన్, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి, ఏసీ ఓబీసీ కో ఆర్డినేటర్, కేతురి వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఏడు మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.