- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వ్యయానికి సంబంధించిన విధులు నిర్వహించే అధికారులకు అవగాహన అవసరం
దిశ, గద్వాల్ కలెక్టరేట్: నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల వ్యయానికి సంబంధించిన విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం గద్వాలలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ, వీవీటి, వీఎస్‌టీ, ఎంసీఎంసీ, అకౌంటింగ్ టీంలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...ఆయా విధులు నిర్వహించే ఎన్నికల అధికారులకు శిక్షణకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చన్నారు. జిల్లా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్‌తో పాటు ఇతర అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ప్రచారం సంబంధించిన పూర్తి ఖర్చులపై దృష్టి పెట్టాలన్నారు.
ఎంసీఎంసీ కమిటీ ద్వారా అభ్యర్థి చెల్లింపు వార్తలను గుర్తించడం, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలన్నారు. వీడియో సర్వే లైన్స్ టీమ్స్ అభ్యర్థులకు సంబంధించిన ర్యాలీలు, సభలను చిత్రీకరించి అక్కడ వేదిక, కుర్చీలు, బ్యానర్లు, తదితర ఖర్చులను అకౌంటింగ్ టీం అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ట్రైనర్ రమేష్‌తో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ నరేష్, ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.