- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన ఎన్టీఆర్: టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని
దిశ, మహబూబ్ నగర్: తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహామనిషి ఎన్ టీ రామారావు అని తెలంగాణ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్.టి రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం స్థానిక సుదర్శన్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన మిని మహానాడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. టీడీపీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్ధు చేసి సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం పొందే హక్కును, తండ్రి ఆస్తిలో మహిళలకు సమాన హక్కును, అందరికీ ఆరోగ్యం, ఉచిత విద్య, వైద్యం, హెల్త్ కార్డులను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీరామారావుదే అని ఆయన కొనియాడారు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పాలన కొనసాగించారని, విజన్ 2020 తో ఐటీ రంగాన్ని నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబుదే అని కాసాని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన మెట్టుకాడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో ప్రజలకు చేరువై, వారి ప్రజల సమస్యలను తెలుసుకున్నామని, రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర,జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.