అట్టహాసంగా ప్రారంభమైన న్యూ ఇయర్ వేడుకలు

by Naveena |
అట్టహాసంగా ప్రారంభమైన న్యూ ఇయర్ వేడుకలు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి,నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మహబూబ్ నగర్ పట్టణంలో న్యూ ఇయర్ వేడుకలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో ఎంబి చర్చి రంగు రంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. జనంతో కిక్కిరిసిన కేక్ షాపులు,వైన్స్ ల ముందు జనాలు బారులు తీరారు. పోలీసులు పకడ్బందీగా తనిఖీలతో పట్టణమంతా సందడి సందడిగా ఉంది. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 20 డ్రంకన్ డ్రైవ్ తనిఖీల బృందాలను ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story