- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
EVs: బ్యాటరీ ఛార్జింగ్, ఇన్‌ఫ్రా కోసం పీయూష్ గోయల్‌తో ఈవీ కంపెనీల చర్చలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఈవీ రంగంలో బ్యాటరీ ఛార్జింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా పలు అంశాలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పరిశ్రమకు చెందినవారు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐటీ) అధికారులు కూడా పాల్గొన్నారు. టాటా, టీవీఎస్, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రతినిధులు చర్చల్లో ఉన్నారు. స్వాపింగ్ స్టేషన్‌లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, ప్రమాణాలకు సంబంధించి సమస్యలను ప్రభుత్వం ముందుంచారు. అంతర్జాతీయ సంస్థలు స్థానికంగా తయారీని చేపట్టేందుకు గతేడాది మార్చిలో ప్రభుత్వం ఈవీ పాలసీని రూపొందించింది. దీని ద్వారా రూ. 4,288 కోట్ల కనీస పెట్టుబడితో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు సుంకం రాయితీలను అందించింది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఈవీ కార్లను తయారు చేస్తున్నాయి. అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. 2022లో దాదాపు 10 లక్షల యూనిట్లు విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమ్మకాల స్థాయిలో ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్, ఇన్‌ఫ్రా అందుబాటులోకి లేకపోవడంతో కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి.. ఈవీలకు కొత్త సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అవసరంలేదన్నారు. దేశీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ సానుకూలంగా ఉంది. కొత్త ప్రోత్సాహకాలు అవసరంలేదు. ఇప్పటికే అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలు సరిపోయాయి. బ్యాటరీ ఖర్చులు కూడా తగ్గాయి, ఈవీ కొనుగోలు ద్వారా ఆర్థిక ప్రయోజనాలతో పాటు బ్యాటరీ మార్పిడి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.