ఘనంగా అయ్యప్ప స్వామి 33వ మహా పడిపూజ

by Naveena |
ఘనంగా అయ్యప్ప స్వామి 33వ మహా పడిపూజ
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : జిల్లా కేంద్రం వల్లంపల్లి రోడ్ లోని శ్రీ శబరి పీఠం అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో గత 33 సంవత్సరాలుగా మహా పడిపూజ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని భారం భావి నుంచి కలశము, పూర్ణం,పుష్కలం గురుస్వాముల ఆధ్వర్యంలో..జిల్లా కేంద్రంలోని పుర వీధుల గుండా స్వాములు ఊరేగింపుగా వెళ్లి బసవేశ్వర దేవాలయం దగ్గర వైభవంగా అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ నిర్వహించారు. 18వ పాదం పూర్తి చేసుకున్న స్వాములను ఘనంగా సన్మానించారు. స్వామి వారి భజన సంకీర్తనలు అలరించాయి.

Advertisement

Next Story