Aghathiyaa: మనకి ఈ ఓల్డ్ స్టోరీకి సంభందం లేదు.. భయపెడుతున్న టీజర్

by sudharani |
Aghathiyaa: మనకి ఈ ఓల్డ్ స్టోరీకి సంభందం లేదు.. భయపెడుతున్న టీజర్
X

దిశ, సినిమా: జీవా (Jiiva), అర్జున్ (Arjun), రాశీ ఖన్నా (Rashi Khanna) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అగాధియా’ (Aghathiyaa). పా విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని డాక్టర్ ఇషారి కె గణేష్ అండ్ అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ నటుడు యోగి బాబు (Yogi Babu), VTV గణేష్, రెడిన్ కింగ్స్లీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఫాంటసీ అండ్ హారర్ (Fantasy and Horror) థ్రిల్లర్‌గా రూపొంతున్న ‘అగాధియా’ నుంచి తాజాగా టీజర్ (Teaser) రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘1940- 82 ఏళ్ల ముందు ఈ బంగ్లాలో ఏవేవో సంఘటనలు జరిగాయి.. మనకు ఈ ఓల్డ్ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు’ అనే డైలాగ్స్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో ఆత్మలు, కొందరు ఉరి వేసుకుని చనిపోవడం లాంటివి కనిపిస్తాయి. మొత్తంగా ఈ టీజర్ ప్రేక్షకులను భయపెట్టగా.. సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.


Advertisement

Next Story

Most Viewed