- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవోదయ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
దిశ, బిజినేపల్లి : వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు గడువును పరిపాలన కారణాల రీత్యా అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ, లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పి .భాస్కర్ కుమార్ కోరారు. నవోదయలో 6వ తరగతి ప్రవేశం కోరేటటువంటి అభ్యర్థులు ప్రస్తుతం ఐదో తరగతి ఉమ్మడి జిల్లాలోనే చదువుతూ ఉండి, అభ్యర్థుల తల్లిదండ్రుల నివాసం ఉమ్మడి జిల్లాలోనిదై ఉండాలని ఆయన అన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు. ఇందుకు గాను ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధ్రువపత్రం,ఫొటోతో దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించవచ్చుని, వచ్చే నెల 7వ తేదీ చివరి తేదీ అని,ఉమ్మడి జిల్లాలోని తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు త్వరపడి తమ తమ పిల్లలను ప్రోత్సహించి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ దరఖాస్తులో కులము,లింగం,ప్రాంతం,మీడియం, వైకల్యం వివరాలలో తప్పులుంటే నివారించుకునేందుకు చివరి తేదీ ముగిసిన అనంతరం రెండు రోజులు ( అక్టోబర్ 8,9 తేదీలు)ఆన్ లైన్ కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.