దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం.. డీకే అరుణ

by Sumithra |
దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం.. డీకే అరుణ
X

దిశ, మదనాపురం : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం మండల పరిధిలో గోపాన్ పేట గ్రామంలో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని, 18 కోట్ల మంది పార్టీలో సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు.

2014 నాటి నుంచి దేశంలోని అట్టడుగున ఉన్న ప్రజలు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీది అని అన్నారు. బీజేపీ పటిష్టానికి యువత పనిచేస్తుందని కొనియాడారు. అనంతరం వివిధ పార్టీ చెందిన 40 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు భారత్ భూషణ్, బాబు గౌడ్, పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed