లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌

by Vinod kumar |
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌
X

దిశ, దామరగిద్ద: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల తహశీల్దార్‌ వెంకటేష్ సోమవారం ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దామరగిద్ద మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన రైతు బింగి వెంకటప్ప తనకు ఉన్న 25 గుంటల భూమిని నాన్ అగ్రికల్చర్ మార్పుకు దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ వచ్చిన స్టాంప్ పేపర్ తప్పిపోవడంతో వెంకటప్ప రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. 5,000 రూపాయలు ఇచ్చి తీసుకు వెళ్ళమని తహశీల్దార్‌ రైతుకు సూచించాడు.

దీంతో వెంకటప్ప ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వెంకటప్ప తహశీల్దార్‌ వెంకటేష్‌కు 5,000 రూపాయలు ఇచ్చి స్టాంపు పేపర్స్ తీసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు తహశీల్దార్‌ ప్యాంటు జేబులో ఉన్న 5,000 రూపాయలను స్వాధీన పరుచుకొని తహశీల్దార్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed