MLA Madhusudan Reddy : 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు

by Naveena |
MLA Madhusudan Reddy : 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు
X

దిశ,అడ్డాకుల : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి( MLA Madhusudan Reddy )అన్నారు.ఆదివారం అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే సన్న వడ్లకు రూ.500 అదనపు బోనస్ ఇస్తామన్నారు. ఏ వన్ గ్రేడ్ క్వింటాలుకు రూ.2320,సన్న వడ్లకు రూ.2820 మద్దతు ధర గా ఉంటుందని పేర్కొన్నారు.రైతుల సంక్షేమం ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఘనపురం బ్రాంచ్ కెఎల్ఐ కెనాల్ ఆఖరి ఆయకట్టు సుంకరం పల్లి వద్ద ఆగిపోవడంతో.. గత కొన్నేళ్లుగా గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటంతో తిమ్మాయిపల్లి,అడ్డాకుల చెరువుకు కృష్ణ నీరు రాలేకపోయాయి. పెండింగ్ ఉన్న సమస్యను పరిష్కరించి,సుంకరం పల్లి రైతులకు పరిహారం అందించి,కాలువ పనులను ప్రారంభించి,చెరువులకు కృష్ణా జలాలను తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం జాతీయ రహదారి నుంచి వెంకంపల్లి రహదారి మధ్యలో వర్నె వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్, రోడ్డు పనులను పరిశీలించారు. కురుమూర్తి జాతర నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్,అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed