- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ రాక.. పాలమూరు రాజకీయాలలో కాక
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలమూరు జిల్లా పర్యటన అక్టోబర్ 1న ఖరారు కావడంతో రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా బీజేపీ రాష్ట్ర నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. అనూహ్యంగా బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని మార్చడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోను పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. సబ్దుగా ఉన్న పరిస్థితులలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధానమంత్రి వస్తుండడంతో ఇటు పార్టీ శ్రేణులలో ఒకంత ఉత్సాహాన్ని తీసుకొస్తుండగా.. ప్రత్యర్థి పార్టీలకు కంటగింపు అవుతోంది. మొత్తంపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధానమంత్రి వస్తుండడంతో రాజకీయాలలో పలు పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
పాలమూరు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..
పాలమూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తప్పనిసరిగా పోటీలో ఉంటారు అని భావించే అభ్యర్థుల వివరాలను ప్రకటించడంతో పాటు.. ఎన్నికల సమయానికి పోటీలో ఉండే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుని డబుల్ ఇంజన్ సర్కార్‌ను ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి సాధిస్తుంది అన్న సందేశాన్ని.. ఈ ప్రాంతంలో ఉండే కరువు కాటకాల నిర్మూలనకు తీసుకునే చర్యలు, రైల్వే, రోడ్డు మార్గాల అంశాలను ప్రధానమంత్రి వివరించే అవకాశాలున్నాయి.
ఈ అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు, జాతీయ రహదారులు-రైల్వే లైన్లు తదితర అంశాలను గురించి ప్రధానమంత్రి స్వయంగా వివరించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన వెనక ఉన్న ఆంతర్యం అర్థం కాక ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రధానమంత్రి ఏ అంశాలను గురించి ప్రస్తావించబోతున్నారు.. ప్రధాని పర్యటన నేపథ్యంలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి అన్న అంశాలను గురించి ఆయా పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు.
వర్చువల్ విధానంలో...
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన జాతీయ రహదారులు, జంక్షన్ల నిర్మాణాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయనున్నారు.అక్టోబర్ 1న ప్రధానమంత్రి పర్యటన ఖరారు కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులు ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రభావం చూపాయి. కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రధాని పర్యటన ఖరారుతో ఉత్సాహంగా ఉన్నారు. సభకు జనాన్ని భారీ ఎత్తున తరలించేందుకు నియోజకవర్గాల వారీగా ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. ప్రధానమంత్రి పర్యటన, ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చే హామీల కారణంగా రాజకీయ పరిణామాలు కొంతమేర మారే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.