- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పడమటి ఆంజనేయ స్వామి తిరుణాల్లపై అధికారులతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సమీక్ష

దిశ, మక్తల్: మక్తల్ పడమటి ఆంజనేయస్వామి తిరుణాల్లొ వీఐపీలకు సామాన్య భక్తులకు ఒకేవిధంగా స్వామి దర్శనం కల్పిస్తే భక్తులకు ఇబ్బంది కలగదని అందుకు అందరూ కలిసి పని చేద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఈనెల 24 నుంచి 30 వరకు జరిగే పడమట ఆంజనేయ స్వామి తిరుణాలపై సోమవారం రోజు సాయంత్రం ఆలయ ఆవరణలో తిరుణాల ఉత్సవాల సందర్భంగా ఈవో శ్యామా సుందర చారి, ప్రధాన పూజారి ప్రాణేశ చారి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరయ్యారు.
మక్తల్ పట్టణ వాసులకు అందరికి పడమటి ఆంజనేయ స్వామి ఇంటి దైవమని అత్యంత భక్తి విశ్వాసులతో కొలుస్తారన్నారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు అంజనేయున్ని కొలిచేందుకు వస్తారని వారికి, ఇబ్బందులు కలగకుండా తిరునాళ్లకు వచ్చి పోయిన వారికి తీపి గుర్తులు నిలిచిపోయే విధంగా పట్టణ వాసులందరూ రాజకీయా హోదాలను పక్కనపెట్టి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకు కలిసి పని చేద్దామని ఆయన అన్నారు.
ట్రాఫిక్ సమస్య రాకుండా వీఐపీ వాహనాలను సైతం సామాన్య వ్యక్తి వాహనాలుగా చూడాలని. పోలీసులతో అన్నారు. రథాన్ని లాగేందుకు భక్తులకు యువకులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేస్తే పరిమితమైన వ్యక్తులతో రథాన్ని లాగేలా చూడాలని అన్నారు. తిరుణాల కు వచ్చే భక్తులకు మున్సిపాలిటీ అధికారులు మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని తిరునాళ్లలో అందుబాటులో ఉన్న స్థలాల్లో వీధి దీపాలను అమర్చాలన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పడమటి ఆంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా నారాయణపేట రొడ్డు సర్కిల్, కన్యకా పరమేశ్వరి గుడి సర్కిల్‌లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు.
తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందు కావలసిన నిధులు ఆయా శాఖల నుంచి కేటాయించకుంటే తన సొంత నిధుల నుండి తిరునాళ్ళకు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ తహసీల్దార్ సువర్ణ రాజు, నారాయణపేట డిపో మేనేజర్ లక్ష్మీ సుధా, ఎస్సై పర్వతాలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి తిరుపతి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఆర్డబ్ల్యూఎస్ వినోద్, ఎఈ విద్యుత్ శాఖ అధికారి జి.గోపాల్ రెడ్డి, రవి కుమార్ యాదవ్, వైస్ చైర్మన్ అఖిల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.