MLA Thudi Megha Reddy : గ్రామీణ బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే..

by Sumithra |
MLA Thudi Megha Reddy : గ్రామీణ బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే..
X

దిశ, వనపర్తి : గ్రామీణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో నూతన అర్టీసీ అంతర్గత గ్రామీణ బస్సు సర్వీసులను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నూతన బస్సును నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా విస్తరిస్తున్న నేపథ్యం విద్యార్థులు, మహిళలు, రైతుల సౌకర్యార్థం మొదట ప్రభుత్వ మెడికల్ కళాశాల నుండి గోపాల్ పేట వరకు నూతన ఆర్టీసీ అంతర్గత గ్రామీణ బస్సు సర్వీసులను ప్రారంభించామని తెలిపారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ప్రయాణికులను చేరవేసేందుకు 30 ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, డిప్యూటీ ఆర్ ఎం ధర్మ, డిపో మేనేజర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed