MLA Rajesh Reddy : ప్రజల ఆరోగ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు భాగస్వామ్యం కావాలి

by Aamani |
MLA Rajesh Reddy : ప్రజల ఆరోగ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు భాగస్వామ్యం కావాలి
X

దిశ, తెలకపల్లి : ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ప్రైవేట్ హాస్పిటల్ కూడా భాగస్వామి కావాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దివ్య పాలీ క్లినిక్ ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రాల్లో కూడా ఎంబీబీఎస్ చేసిన మంచి డాక్టర్లను ఏర్పాటుచేసి వైద్యం చేయించడం ఎంతో అభినందించాల్సిన అవసరం ఉందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తో పాటు సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ మామిళ్ళపల్లి యాదయ్య, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, సింగల్ విండో డైరెక్టర్ రాజ మహేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బాలా గౌడ్, మండల మాజీ వైస్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, శ్రీను, జిలాని ఎల్ల స్వామి డాక్టర్ అలేఖ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story