ముస్లీం మహిళలకు రంజాన్ బహుమతులను అందజేసిన.. మంత్రి నిరంజన్ రెడ్డి

by Hamsa |
ముస్లీం మహిళలకు రంజాన్ బహుమతులను అందజేసిన.. మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం సమానత్వం పరమావదిగా అన్ని మతాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పేద ముస్లిం మైనారిటీ మహిళలకు రంజాన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనస్సుతో ఆలోచించి కుల మత భేదాలకు తావివ్వకుండా అన్ని మతాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

పేద ముస్లిం మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం షాదీ ముబారక్,ఆసరా పెన్షన్లు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కేంద్రాలను, మహిళా సాధికారతలో భాగంగా మహిళలకు శిక్షణ ఇచ్చి లోన్లను ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో గత ఏడు సంవత్సరాలుగా ముస్లిం మైనారిటీ ప్రజలకు రంజాన్ పండుగ బహుమతులను అందజేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ వారికి శ్రీధర్,తాసిల్దార్ రాజేందర్ గౌడ్,మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి,పుర కౌన్సిలర్ లు సత్యం సాగర్, పుట్టపాక మహేష్,కోఆప్షన్స్ సభ్యులు గులాం ఖాదర్, ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్, సీనియర్ మైనార్టీ నాయకులు రహీం, ముస్లిం మైనారిటీ మహిళలు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed