- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Jupally : నిర్దేశిత రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలి
దిశ,వనపర్తి : 2024-25 ఆర్థిక సంవత్సర నిర్దేశిత రుణ ప్రణాళిక లక్ష్యాలను వంద శాతం సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆబ్కారీ,పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బ్యాంకు అధికారులను సూచించారు.శుక్రవారం ఐడీఒసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సంప్రదింపుల సమావేశానికి రాష్ట్ర ఆబ్కారీ,పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి జూపలి కృష్ణా రావు మాట్లాడుతూ రైతు రుణమాఫీ ద్వారా వనపర్తి జిల్లాలో సుమారు 400 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని,బ్యాంకర్లు రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లో మాత్రం 10 శాతం దాటలేదన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3454.92 కోట్లు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకోగా జూన్, 2024 వరకు కేవలం 324.92 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.యం.యస్.యం. ఈ, ప్రియారిటి సెక్టార్లు అయిన విద్యా, గృహ నిర్మాణం తదితర రంగాల్లో 3961 కోట్ల రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకోగ ఇచ్చింది మాత్రం 386.28కోట్లేఅన్నారు.రైతులు,నిరుద్యోగులకు పంట రుణాలకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు పెట్టకుండా రుణాలు ఇవ్వాలన్నారు..ఈ సమావేశంలో ఎల్ డీ ఒ రిజర్వ్ బ్యాంక్ రెహమాన్, నాబార్డ్ ఏ.జి.యం మనోహర్ రెడ్డి, ఏపీజీవీబీ ఆర్.యం రంజిత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే,యూనియన్ బ్యాంక్ ఏ .జి.యం మురళీ,జిల్లా సంక్షేమ శాఖల అధికారులు,బ్యాంకర్లు,రైతులు తదితరులు పాల్గొన్నారు.