- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మత్స్య శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
దిశ, కొల్లాపూర్: ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై అందించే ఉచిత చేప పిల్లలు నిర్దేశించిన సైజ్ లో లేవంటూ జిల్లా మత్స్యశాఖ అధికారుల పై రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో వివిధ రకాల 5 లక్షల ఉచిత చేప పిల్లలను బుధవారం విడుదల కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రజిని హాజరయ్యారు. ఆంధ్ర నుంచి సోమశిలలోని జనరల్ పుష్కర ఘాట్ వద్దకు బొచ్చేలు, రోహు, రవ్వుట రకాలకు చెందిన ఐదు లక్షల చేప పిల్లలను 5 డీసీఎం వాహనాల్లో అధికారులు రప్పించారు. అయితే కృష్ణానదిలో ప్రభుత్యం అందించే ఉచిత చేప పిల్లల విడుదలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉపక్రమించారు. అప్పటికే నది నీటిలో వలలో నిల్వ ఉంచిన చేప పిల్లలను పరిశీలించేందుకు మంత్రి పుష్కర ఘాట్ మెట్ల మీద నీటిలోకి దిగారు. తన చేతులతో చేప పిల్లలను నిశితంగా పరిశీలించి 80 శాతం సైజు తక్కువగా ఉంచడం, అందులో శాంపిల్స్ కోసం 4,5 పెద్ద సైజ్ చేప పిల్లలను ఉంచారంటూ మంత్రి జూపల్లి ఆ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రజినిని మంత్రి నిలదీశారు. దీంతో నదిలో చేప పిల్లలను విడుదల చేయకుండా డీసిఎం వాహనాలను మంత్రి వాపస్ చేయించారు.
ఉమ్మడి పాలమూరు, నిజామాబాద్ జిల్లాలలో చేప పిల్లలను విడిచే క్రమంలో ఆయా గ్రామాల్లో ఉన్న మత్స్య సహకార సంఘాల సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ఓ గ్రూపును,వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి అందులో కలెక్టర్ల తో పాటు..ఆయా నియెజకవర్గాల ఎమ్మెల్యేలకు సమాచారం నిమిత్తం అందుబాటులో ఉంచాలని మంత్రి జూపల్లి మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. జలాశయాలలో చేప పిల్లలను విడుదల చేయడానికి వారం ముందు సమాచారాన్ని ఆ శాఖ అధికారులు ఉంచాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. అందరి సమక్షంలోనే చేప పిల్లలను జలాశయాలలో వదలాలని మంత్రి జూపల్లి మత్స్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరి కొనుగోళ్ల కేంద్రాలలో కూడా గతంలో మాదిరి కాకుండా ధాన్యాన్ని కేంద్రానికి తీసుకు వచ్చే రైతు ఎన్ని క్వింటాళ్లు, ఎన్ని డబ్బులు, వివరాలతో నిర్వాహకుల సంతకాలతో కూడిన రసీదును రైతులకు ఇవ్వాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. రైతులు దళారీల బారిన పడకుండా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు.
అంతకు ముందు మంత్రి జూపల్లి సోమశిలలో వీఐపీ,జనరల్ ఘాట్ల వద్ద కార్పొరేట్ స్థాయిలో మరుగుదొడ్లు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని పీఆర్ ఏఈ సాయిరాం ను మంత్రి ఫోన్ లో ఆదేశించారు. సోమశిలకు పర్యాటకుల తాకిడి ఉండడంతో..జనరల్ పుష్కర ఘాట్ వద్ద ఉన్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఆర్డీవో బన్సీలాల్, తాసిల్దార్ విష్ణువర్ధన్ రావు, ఎంపీడీవో మనోహర్, జిల్లా పర్యటన శాఖ అధికారి కల్వరాల నరసింహ, తాలూకా స్పెషల్ ఆఫీసర్ కృష్ణయ్య, మత్స శాఖ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, రాహుల్, రాజకుమార్, సైదులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఇక్బాల్, కాంగ్రెస్ నాయకులు నాగరాజు, వంగ రాజశేఖర్ గౌడ్, బీచుపల్లి యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, మాజీ సర్పంచ్ మద్దిలేటి, మల్లేశ్వరం శేఖర్, కృష్ణా నది మత్స్య సహకార మార్కెటింగ్ చైర్మన్ గోవింద్ తదితరులు ఉన్నారు.