- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఎంబీబీఎస్ సీటు.. సాయం కోసం ఎదురుచూపులు
దిశ, హన్వాడ : చదువుకోవాలని ప్రతిఒక్కరికి ఉన్నా..ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. కానీ ఆర్ధిక పరిస్థితి సరిగా లేకపోతే అనుకున్న తీరానికి చేరలేక చాలా మంది విద్యార్థులు చదవాలని ఉన్నా చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అదే పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్న దర్పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కు ఎదురైంది. గ్రామానికి చెందిన గోవిందు, శివానీలు కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను, ఒక కూతురిని చదివిస్తున్నారు. తమ పెద్ద కుమారుడు వెంకటేష్ కు ఇటీవలే వరంగల్ కాలోజీ నారాయణరావు యూనివర్సిటీలో నీట్ లో MBBS సీటు సాధించాడు. అంత పెద్ద చదువులు చదివించడానికి తమ ఆర్ధిక పరిస్థితి లేదని తల్లిదండ్రులు చెప్పడంతో..తనను చదివించడానికి దాతలు ఎవరైనా సహాయం చేస్తారని వెంకటేష్ ఎదురుచూస్తున్నాడు. సంవత్సరానికి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వెంకటేష్ తెలిపారు. దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని కోరారు.