- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మనిషి ఆకారంలో కాండం తొలుచు కీటకం.. జోగులంబ గద్వాల జిల్లాలో వింత..
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు... వాటిలో కొన్ని సహజత్వానికి భిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇటువంటి వింతే గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామంలో వెలుగు చూసింది. హలీం పాషా అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాన్ని తలపించేాలా ఉన్న కాండం తొలుచు కీటకాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కీటకానికి మనిషికి ఉన్నట్లుగా ముక్కు, నోరు, తల భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అరుదైన కీటకాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.
కాగా ఈ కీటకాన్ని స్టిక్ బగ్ (కాండం తొలుచు కీటకం) అంటారు అని పాలమూరు విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాజశేఖర్ తెలిపారు. ఇవి ఎల్లో, పింక్, రెడ్ కలర్స్ లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి కీటకాలు ఎక్కువగా శ్రీలంక, ఆఫ్రికా, థాయ్ ల్యాండ్ దేశాలలో ఎక్కువగా ఉంటాయని, మనదేశంలో తక్కువ సంఖ్యలో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కీటకం మనిషిని పోలిన ఆకారాలు ఉండడం జీవ వైవిధ్యంలో భాగంగా ఏర్పడిందని ప్రొఫెసర్ రాజశేఖర్ పేర్కొన్నారు.
Also Read..