సీఎం కేసీఆర్‌ను కలిసిన టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులు

by Disha News Desk |
సీఎం కేసీఆర్‌ను కలిసిన టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: టీఆర్ఎస్ పార్టీ జిల్లాల నూతన అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం నూతన అధ్యక్షులు హైదరాబాదులో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిశారు. అనంతరం మంత్రి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులు ప్రగతి భవన్‌కు చేరుకొని తమపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పని చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed