శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం : అచ్చంపేట ఎమ్మెల్యే

by Aamani |
శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం : అచ్చంపేట  ఎమ్మెల్యే
X

దిశ, అచ్చంపేట : శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గ చేతుల మీదుగా మాధవ రెడ్డి తో కలిసి ఉమామహేశ్వర క్షేత్రం లో ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏర్పాట్లపై పాలకమండలి చైర్మన్ సభ్యులు సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తదుపరి అమ్రాబాద్ మండలంలోని తెలుగు పల్లి గ్రామ సమీపంలో ఉన్న నల్లమల అడవిలో కొలువుదీరిన అంతర్గంగా వద్దా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed