- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న పార్టీలను తరిమికొడదాం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
దిశ, జడ్చర్ల / రాజపూర్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని అలాంటి పార్టీలను తరిమికొడదామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులో నవాబుపేట మండల బీఆర్ఎస్ నాయకులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళన నియోజకవర్గ ఇంచార్జి, పరిశీలకులు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్ సుపరిపాలనలో గ్రామాలు, పట్టణాలు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో జడ్చర్ల నియోజకవర్గాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, నవాబుపేట జడ్పీటీసీ రవిందర్, ఎంపీపీ అనంతయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, ప్రణీత్ చందర్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.