విద్యాపరంగా జిల్లాను ఉన్నత స్థాయికి తీసుకువెళ్దాం.. కలెక్టర్ సిక్తా పట్నాయక్

by Sumithra |
విద్యాపరంగా జిల్లాను ఉన్నత స్థాయికి తీసుకువెళ్దాం.. కలెక్టర్ సిక్తా పట్నాయక్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్దామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గ్రామీణ భాగస్వామ్య సంస్థ ( వి.ఐ.పి) ఆధ్వర్యంలో బాలికల విద్యను ప్రోత్సహించే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బాలికలకు ప్రోత్సాహక బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు.

గత కలెక్టర్ పదో తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో 15 వ స్థానానికి తీసుకువచ్చారని, ఉమ్మడి జిల్లాలోనే నారాయణ పేటను ప్రథమ స్థానంలో నిలిపారని చెప్పారు. ఈ సారి కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకును మరింత మెరుగు పరిచేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని ఆమె సూచించారు. జిల్లాలోని మండలాల వారీగా పదో తరగతిలో 9.5 నుంచి 9.8 జీపీఏ సాధించిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రంతో పాటు రూ.5 నగదు, 20 వేల బ్యాంక్ డిపాజిట్ లు, జ్ఞాపికలను అందజేశారు. డీఈవో అబ్దుల్ ఘనీ, గ్రామీణ భాగస్వామ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేందర్ స్వామి, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ టీకేఎస్ శర్మ, జీసీడీఓ పద్మ నలిని, డీపీఆర్ఓ ఎం.ఏ.రషీద్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story