ఉదయ్ రెడ్డిపై కేసు.. ఖండించిన కుకీ విద్యార్థి సంఘం

by vinod kumar |
ఉదయ్ రెడ్డిపై కేసు.. ఖండించిన కుకీ విద్యార్థి సంఘం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చోటు చేసుకున్న అల్లర్ల వెనుక భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రొఫెసర్ ఉదయ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్యను కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కేఎస్ఓ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రొఫెసర్ ఉదయ్ రెడ్డి సోషల్ మీడియాతో మెయితీ కమ్యూనిటీని కించ పరుస్తూ ఎప్పుడూ పోస్టులు పెట్టలేదు. మణిపూర్ హింస చుట్టూ నెలకొన్ని నిజాలను మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చారు. కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నందుకే ఆయనను వేధిస్తున్నారు’ అని పేర్కొంది.

కుకీ యువతకు మరింత జ్ఞానోదయం కలిగించకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలిపారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉదయ్ రెడ్డిపై చేసిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, మణిపూర్‌లో ఇరు వర్గాలను రెచ్చగొట్టేందుకు ఉదయ్ రెడ్డి ప్రయత్నించారని, సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు పెట్టారని ఇంఫాల్ లో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed