- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
దిశ, హన్వాడ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, బడుగు బలహీన వర్గాల అభివృధ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హన్వాడ మండలంలోని మునిమోక్షం, కిష్టంపల్లి గ్రామాల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. మునిమోక్షం, కిష్టంపల్లి గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు యెన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఆరు గ్యారెంటీ పథకాలు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2,500లు, రైతు భరోసా ద్వారా ఎకరానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, గృహజ్యోతి పథకంతో ప్రతి మహిళ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు, యువ వికాసం కింద 5 లక్షల విద్య భరోసా కార్డు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ గౌడ్, రాఘవేందర్ రాజు, బెక్కరి అనిత, మండల అధ్యక్షుడు టంకర కృష్ణయ్య, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటయ్య, షబ్బీర్, యాదవరెడ్డి, కంచిమి లక్ష్మణ్, శంకర్ నాయక్, రాజు నాయక్, వేముల కృష్ణయ్య, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు శారదమ్మ తదితరులు పాల్గొన్నారు.