వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: మంత్రి నిరంజన్ రెడ్డి

by S Gopi |
వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రం లోని మర్రికుంట సమీపంలో అంతర్జాతీయ వ్యవసాయ సంస్థ సిన్జెంటా సామాజిక బాధ్యతతో రూ. 3 కోట్ల నలభై లక్షలతో నిర్మించిన భారత దేశంలోనే మొట్టమొదటి ఐ క్లీన్ సైడ్ మార్కెట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సంస్థ గ్లోబల్ సీఈఓ ఏరిక్ ఫైర్వాల్డ్ తో కలిసి ప్రారంభించారు. సింజంటా సంస్థ సీఈఓకు, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మెమెంటో బహుకరించి సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతుల ఆదాయం, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో మళ్ళీ చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రైస్ బౌల్ గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రజలకు వసతులు కల్పిస్తున్నామన్నారు. వనపర్తిలో వ్యవసాయ కళాశాల భవన నిర్మాణం కోసం సింజెంటా కంపెనీ సహకారం అందించాలనీ కోరారు. అత్యున్నత ప్రమాణాలతో పిల్లలకు కేర్ యూనిట్, రైతులకు వినియోగదారులకు మరుగు దొడ్లను, పచ్చదనంతో వే సైడ్ మార్కెట్ ను నిర్మించామన్నారు. వే సైడ్ మార్కెట్ రైతులు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెలే అబ్రహం, వ్యవసాయ కమిటీ అధ్యక్షులు రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ప్రారంభించిన సిన్జెంటా ఇండియా చీఫ్ షష్టి ఎనబిలిటీ ఆఫీసర్ డాక్టర్ కే సి రవి, ఇండియా హెడ్ సుశీల్ కుమార్, సేల్స్ హెడ్ ఫణింద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story