- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలమూరు నిర్వాసితుల ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు
దిశ, బిజినేపల్లి: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిజినపల్లి మండలం వట్టెం గుట్టను అక్రమంగా తొలిచి అదే ప్రాంతంలో పునరావాసం కల్పించి ఇళ్లను నిర్మించింది. కానీ ఆ ఇళ్లల్లోకి నేడు అర్ధరాత్రి వట్టెం గుట్ట కొండ చర్యలు విరిగి పడ్డాయి. ఇళ్లలోకి వరద నీరు మురుగు వచ్చి చేరింది. దీంతో ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా నిర్వాసితులంతా షాక్ గురయ్యారు . కాళ్లు బయట అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. గవిళ్ళ వెంకటయ్య ఇల్లు కొండా చర్యలకు విరిగిపడి చంద్రవంతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
కాలనీ అంతా పూర్తిగా బురద మయంగా మారి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తినే బియ్యం బట్టలు ఇతర సామాగ్రి పూర్తిగా బురదలోనే కూరుకుపోయింది. అయినా అటువైపు ఎవరు ప్రస్తుత అధికారులు రావడంలేదని,తమను ఆదుకోవడం లేదని నిర్వాసిత కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఈ ముసురు వర్షానికి అక్రమంగా తోల్చిన వట్టెం గుట్ట పూర్తిగా తడిసి ముద్దయి అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి నిర్వాసిత కాలనీలోకి జారిపడింది. దీంతోపాటు చెరువులు కుంటలు నాలుగు పారుతుండడంతో ఆయా గ్రామాలకు పట్టణాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి . వట్టెం నిర్వాసితులను జిల్లా అధికారులు స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.