- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : MP Dharmapuri Arvind
దిశ, అలంపూర్ టౌన్ : ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, పాలకమండలి చైర్మన్ స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మొదటిసారి జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వాజ్పేయి హయాంలో అమ్మవారి ఆలయాన్ని పునర్ నిర్మించినట్లు గుర్తు చేశారు. కృష్ణా పుష్కరాలకు వచ్చిన కేసీఆర్ అమ్మవారి ఆలయ అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తానని ఇంతవరకు కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా రూ.70 కోట్ల నిధులు కేటాయించగా సద్వినియోగం చేసుకోలేని కేసీఆర్ ప్రభుత్వం అందులో రూ.35 కోట్ల పనులను మాత్రమే వినియోగించుకున్నట్టు చెప్పారు. లేచినప్పటి నుండి తండ్రీ కూతుర్లు అబద్దాలు చెబుతూ జీవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాషాయం జెండా ఎగరేస్తామని తెలిపారు. అంతకు ముందు ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.