- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Jupally : గుడిపల్లి రిజర్వాయర్ నుండి కల్వకుర్తి ఎస్ఐఎస్ ఆయకట్టుకు నీటి విడుదల
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుండి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎస్ఐఎస్) ఆయకట్టుకు నీటిని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మెఘ రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని 3.65 లక్షల ఎకరాల ఆయకట్టులో మూడింట రెండు వంతులకు పైగా గుడిపల్లిగట్టు రిజర్వాయర్ నుంచి నీరు అందుతోందన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గం రైతులకు వాన దేవుడి దయతో రెండు పంటలకు సాగునీరు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవలే ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో పనుల పురోగతి పై వేగవంతం చేసేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని అందుకు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉమ్మడి జిల్లాల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యేలంతా రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం కృష్ణమ్మకు పూలతో స్వాగతం పలికారు. జిల్లాలోని రైతాంగానికి శశ్యామలంగా సాగునీరు అందాలని దేవుని ప్రార్థించారు. అంతకుముందు ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమావేశమై నీటి లభ్యత విద్యుత్ వినియోగం తదితర అంశాలపై కులంకషంగా చర్చించారు. 1 పంపు ద్వారా ప్రతిరోజు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు ఎస్సీ సత్యనారాయణ రెడ్డి, ఈఈ రవీందర్, ఎస్వీఎన్ కంపెనీ ఎండి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.