- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కొడంగల్ లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం'
దిశ, కోస్గి : కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పక్కా అని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తిరుపతి రెడ్డి ఉద్ఘటించారు. గురువారం కోస్గి మండలంలోని ముశ్రిఫా, ముక్తిపహద్ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు బాలకిస్టరెడ్డి, మాజీ సర్పంచ్ మల్లారెడ్డిలతో పాటు దాదాపు 200ల మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో గెలిచేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. అరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడం పక్కా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వార్ల విజయకుమార్, మండల అధ్యక్షుడు రఘు వర్ధన్ రెడ్డి, నాయకులు అన్న కిస్టప్ప, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.