- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..'
దిశ, అచ్చంపేట : ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత ప్రభుత్వాలదని, పదేళ్లు పాలన చేసిన వారు పది నెలల ప్రభుత్వం పై బురద జల్లడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రొహిబిషన్ సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రూ. 1.20 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ముందుగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేతో కలిసి ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నల్లమల్ల ప్రాంతం దేశంలోనే పర్యాటక కేంద్రానికి తలమానికమని పుణ్యక్షేత్రాలైన మల్లెల తీర్థం అక్కమహాదేవి గుహలు మద్దిమడుగు ప్రాంతాల్లో భక్తుల సౌకర్యాలతో పాటు ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకమైన శ్రద్ధ ఈ ప్రభుత్వం పెడుతుందన్నారు. గత రెండు రోజుల క్రితం కొల్లాపూర్ నుండి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో టూరిజం ఓటును ప్రారంభమైందని ఇటు అచ్చంపేట అటు కొల్లాపూర్ రెండు ప్రాంతాలను టూరిజం అభివృద్ధికి ప్రత్యేకమైనచర్యలు తీసుకుంటామన్నారు. తదుపరి అచ్చంపేట పట్టణంలో రూ. 60 లక్షలతో నూతన గ్రంథాలయ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు.
ఈ ప్రభుత్వానికి అప్పుల చిప్ప ఇచ్చింది..
గత పాలకులు ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా ఈ ప్రభుత్వానికి అప్పుల చిప్ప ఇచ్చిందని, అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అయినా కూడా 10 నెల ప్రభుత్వం పై ప్రతిపక్షాలు అవాకులు చివాకులు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అలాగే అచ్చంపేట కొల్లాపూర్ ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గత పాలకుల పరిణామాల పర్యాసానమే వారికి తగిన బుద్ధి ప్రజలు చెప్పారన్నారు.
మిగిలిన రైతులందరికీ రుణమాఫీ...
ప్రభుత్వం ప్రకటించిన విధంగానే రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు తప్పకుండా రుణమాఫీ జరుగుతుందని మంత్రి జూపల్లి మరోసారి గుర్తు చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం అనే విధంగా ప్రజల సొత్తులు మట్టిపాలు చేసిన ఘనత గత పాలకులది అని విమర్శించారు. వారు చేసింది ఏమీ లేకపోవడంతో ఈ ప్రభుత్వంపై బురద చదువుతున్న ధీరుడు కొన్ని పత్రికలు చానళ్లు బాకా ఊపుతున్నాయని విమర్శించారు.
నల్లమలను టూరిజం హబ్ గా ప్రకటించాలి.. ఎమ్మెల్యే
నల్లమలలో 16 పురాతన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని ఉమామహేశ్వర క్షేత్రాన్ని తలమానికంగా చేస్తూ టూరిజం హబ్ గా మార్చేలా నల్లమల్ల ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణ రావు త్వరలో ప్రకటించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ కొరారు. అలాగే జాతీయ రహదారి భూతుపూర్ నుండి మద్దిమడుగు వరకు ప్రతిపాదనలు, అలాగే మద్దిమడుగు వద్ద ఉన్న కృష్ణనది హై లేవల్ బ్రిడ్జి ద్వారా పై రెండు తెలుగు రాష్ట్రాల ఇంటర్ కనెక్టివిటీ జాతీయ రహదారి కోసం త్వరలో మంత్రులతో ఢిల్లీ పర్యటన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లాయర్ రాజేందర్, ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, డైరెక్టర్లు, ఆలయ అధికారులు, నాయకులు మాజీ ఎంపీపీ రామనాథం, కట్ట గోపాల్ రెడ్డి, కాశన్న యాదవ్, కుందా మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.